![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -230 లో....అందరు టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత.. సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది. అల్లుడు గారు దసరా పండుగకి ఇంటికి రండీ అని చెప్తుంది. నాదేం లేదు రామలక్ష్మి ఇష్టమే.. నా ఇష్టమంటూ సీతాకాంత్ రామలక్ష్మికి ఫోన్ ఇస్తాడు. ఇద్దరు పండుగకి రండి అనగానే.. అమ్మా.. ఆయన చాలా బిజీ.. ఒకవేళ వీలైతే వస్తానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళదామంటే నాకు ఇష్టమే కదా ఎందుకు ఇలా నన్ను అడగలేదని సీతాకాంత్ అనుకుంటాడు.
ఆ తర్వాత పాపం రామలక్ష్మి మనం చేసిన పనికి తనలో తనే బాధపడుతుందని సందీప్ శ్రీలత శ్రీవల్లిలు అనుకుంటారు. మరొకవైపు ఎందుకు రామలక్ష్మి నాతో అలా ఉంటుందని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తన బాధని దేవుడికి చెప్తూ బాధపడుతుంది. అప్పుడే ఒకతను వస్తాడు. అతనికి బియ్యం ఇస్తుంది. పిల్ల పాపలతో బాగుండు అని అతను అంటాడు. అంత అదృష్టం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. నువ్వు అనుకునేది తప్పు.. నువ్వు నమ్మేది తప్పని రామలక్ష్మి మనసులో మాటని అనగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి హాస్పిటల్ కి వెళ్లి సీతాకాంత్ కి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తుంది. ఏం ప్రాబ్లమ్ లేదు ఎవరు ఇలా చెప్పారని డాక్టర్ అంటుంది.
నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చని డాక్టర్ చెప్పగానే రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఇదంతా తన అత్తయ్య శ్రీలత ప్లాన్ అని రామలక్ష్మి అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత శ్రీవల్లిలు మాట్లాడుకుంటుంటే రామలక్ష్మి వెళ్లి టపాసులు కాలుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ సిరి అడుగుతుంది. నాలో ఉన్న భయాలన్నీ పోయి నేను హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |